పయనించే సూర్యుడు ఏప్రిల్ 5 న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరపున అధిష్టానానికి విన్నపం.
తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం
-- కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇచ్చి మంత్రి పదవికి కేటాయించాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ తెలిపారు. జిల్లాకు మంత్రి లేక అభివృద్ధి కార్యక్రమాల్లో కొంతవరకు ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు సమర్థవంతంగా తన విధులను నిర్వహిస్తున్నప్పటికీ ఆయనకు తన జిల్లాతో పాటు రాష్ట్రమంతా వ్యవహారాలు ఉండడం వల్ల అత్యధిక సమయాన్ని కేటాయించలేకపోతున్నారని తెలిపారు. అదే స్వయంగా నిజామాబాద్ జిల్లాకు మంత్రి ఉంటే సుదర్శన్ రెడ్డి మంత్రి అయితే కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా ఏకతాటిపై నడిపించగలరని అభివృద్ధిలో కూడా జిల్లా అని ముందుకు తీసుకుపోగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్ రెడ్డి కి అవకాశం కల్పించాలని ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు