ఫిబ్రవరి నిజామాబాద్ జిల్లా బ్యూరో పీకే గంగాధర్: తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలో శనివారం నాడు ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మద్దూరి భాస్కర్,ఉపాధ్యక్షుడిగా కోత్వాల లింబాద్రి, కార్యదర్శిగా మీసాల శ్రీనివాస్, కోశాధికారిగా తాటికొండ గంగాధర్ లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నూతన ప్రెస్ క్లబ్ సబ్యులను సునీల్ రెడ్డి అభినందించారు. నియోజకవర్గంలో పెద్ద మండలం అయిన భీంగల్ లో విలేఖరులకు ప్రెస్ క్లబ్ లేక ఇబ్బందులు పడుతున్నారని,నాయకుల సమావేశలు చెట్ల కింద జరుగుతున్నాయని,భీంగల్ లో ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించలని సునీల్ రెడ్డి దృష్టికి తీసుకుపోగా సానుకూలంగా స్పందించి భీంగల్ తహశీల్దార్ తో మాట్లాడి ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు దుర్గ ప్రసాద్,రాజేశ్వర్,లింబాద్రి తదితరులు ఉన్నారు.