పయనించే సూర్యుడు ఆగస్టు 25 (పొనకంటి ఉపేందర్ రావు)
సోమవారం టేకులపల్లి సులానగర్ పంచాయతీలో మాస్ వెల్ఫేర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం. నిర్వాహకులు
బల్లెం కరుణ శ్రీ -చిట్టిబాబు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.కుట్టు మిషన్ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఆర్థిక పరిస్థితుల మెరుగుపరుచుటకు కుట్టు మిషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, కుట్టుమిషన్ లో మంచి నైపుణ్యత సాధించినవారు రోజువారీగా వెయ్యి నుండి పదిహేను వందల వరకు సంపాదించి కుటుంబానికి భరోసాగా నిలుస్తున్నారని వారు గుర్తు చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ -ఆంధ్ర అనేక ఉచిత మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసి మహిళలకు ఆత్మ భరోసా కల్పించామని వారు గుర్తు చేశారు. 90 రోజులు వరకు జరిగే శిక్షణ తరగతులను. టేకులపల్లి మండల పరిసర ప్రాంత మహిళలు వినియోగించుకోవాలని నిపుణులైన వారిచే శిక్షణ తరగతులు జరుగుతాయని.వారు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో టీచర్స్ బోడ వజ్రమ్మ, రమాదేవి, బోడ నాగలక్ష్మి, గుమ్మడి మేరీ కుమారి, బల్లెం సౌజన్య, మణెమ్మ, అరుణ, తదితరులు పాల్గొన్నారు.ఎండ్ న్యూస్