పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 11:- రిపోర్టర్( కే శివకృష్ణ)
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే “సాగర్ కవచ్ ఆపరేషన్‌ను ది 09.04.2025 నుంచి 10.04.2025 సాయంత్రం వరకు సూర్యలంకలో మెరైన్ పోలీస్ మరియు బాపట్ల జిల్లా లోకల్ పోలీసులు నోడల్ ఆఫీసరు అయిన బాపట్ల DSP G. రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడమైనది. ఈ ఆపరేషన్‌లో రెడ్ ఫోర్స్ రూపంలో కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీస్, ఇతర విభాగాలు పాల్గొని చొరబాటుదారులు, తీవ్రవాదుల ఆగమనాన్ని అడ్డుకునే విన్యాసాలు మరియు బ్లూ ఫోర్స్ వారు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించడం జరిగింది. అందులో భాగంగా ది.10.04.2025 న సూర్యలంకలోని కేంద్రీయ విద్యాలయం (ఎయిర్ ఫోర్స్ స్టేషన్) మరియూ హరిత రిసార్ట్స్ వద్ద జరిగిన డమ్మీ ఆపరేషన్లలో రెడ్ ఫోర్స్‌ను మెరైన్ పోలీస్ సిబ్బంది అదుపులోకి తీసుకొని విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించారు. ఈ ఆపరేషన్‌కు బాపట్ల డీఎస్పీ G. రామాంజనేయులు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరించగా, వీరితో పాటు మెరైన్ సీఐ లక్ష్మారెడ్డి, రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు నాగశివారెడ్డి, శ్రీనివాసరావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.