పయనించే సూర్యుడు న్యూస్
చివ్వేంల మండల ప్రతినిధి బి.వెంకన్న జనవరి 10/1/25
వార్తా విశ్లేషణ సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం ఐలాపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గుప్త.ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వలస కూలీలను చత్తీస్ ఘడ్ నుంచి హైదరాబాద్ కు తీసుకెళ్తోంది.ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే నిలిపి ఉన్న ఓ లారీని.బస్సు అతివేగంతో ఢీ కొట్టింది.ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు 17 మందికి గాయాలు మృతులంతా ఒరిస్సాకు చెందిన వారిగా గుర్తింపు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలింపు వీరిలో ఇద్దరికీ సీరియస్ గా ఉందని సమాచారం ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది స్థానిక సమాచారం మేరకు సూర్యాపేట డి.ఎస్పీ రవి ఆధ్వర్యంలో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..