పయనించే సూర్యుడు న్యూస్ చివ్వెంల మండల ప్రతినిధి బి వెంకన్న ఫిబ్రవరి 12 వార్త విశ్లేషణ దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 2000 మంది పోలీస్ బందోబస్తుతో పటిష్ట భద్రత 68 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా.దొంగతనాల నివారణకు పోలీస్ స్పెషల్ టీమ్స్ మహిళల రక్షణకు షీ టీమ్స్ సిబ్బందిని మహిళా సిబ్బందిని నియమించాం జాతర ప్రాంగణంలో బెట్టింగ్ లు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకుండా చర్యలు 16 వ తేది తెల్లవారు జాము నుండి జాతీయ రహదారి 65 పై వాహనాల మళ్లింపు జాతర నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం, ప్రజలు అందరూ కలిసిమెలిసి జాతర సంతోషంగా జరుపుకోవాలి.సన్ ప్రీత్ సింగ్ ఎస్పీ సూర్యాపేట జిల్లా.తెలంగాణ రాష్ట్ర రెండవ అతిపెద్ద జాతర దురాజ్ పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఈనెల 16 వ తేదీ నుండి ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అదనపు ఎస్పి నాగేశ్వరరావు,సూర్యాపేట సబ్ డివిజన్ డి.ఎస్పీ రవి,స్థానిక సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం స్థానిక ఎస్ఐ మహేశ్వర్ లతో కలిసి జాతర ప్రాంగణంలో పోలీసు భద్రత ఏర్పాట్లను,బందోబస్తు ఏర్పాట్లను, జాతర రూట్ మ్యాప్, గ్లోబల్ మ్యాప్ లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తుల యొక్క వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను చేసిన భారీ ప్రదేశాలను,సిబ్బంది వసతి,జాతరకు వచ్చి పోయే మార్గాలు,జాతర ప్రాంగణంలో భారికెడ్లు ఏర్పాటు దేవస్థానం రక్షణ ను ఎస్పీ పరిశీలించారు. జాతరకు వచ్చిపోయే అన్ని మార్గాలలో భక్తుల వాహనాల వల్ల,భక్తుల రద్దీ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.జాతర ప్రారంభమయ్యే 16వ తేదీ నుండి జాతీయ రహదారి 65 పై వాహనాల మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే వాహనాలను నార్కేట్ పల్లి వద్ద నల్గొండ మీదుగా మిర్యాలగూడ హుజూర్ నగర్ కోదాడ వైపు మళ్లించడం చేస్తున్నామని అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద హుజూర్ నగర్.నల్గొండ వైపుగా మళ్లింపు చేస్తున్నామని తెలిపారు. వాహనాల మళ్లింపు లు ఉంటాయి కాబట్టి వాహనదారులు ముందుగా గమనించాలని కోరారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జాతర నిర్వహణకు అన్ని ఏర్పాటు పూర్తి చేశాం, జాతర నిర్వహణకు అన్ని భద్రత చర్యలు తీసుకున్నాం అన్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తారు, జాతరకు 2000 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట రక్షణ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇతర జిల్లాల పోలీసు సిబ్బందిని ఉపయోగిస్తున్నము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు దైవదర్శన సౌకర్యం కలిగించడం పోలీసు ముఖ్య విధి అని తెలిపారు.జిల్లా యంత్రాంగం,ఇతర శాఖలతో కలిసి పని చేస్తాము అని తెలిపినారు.జాతర ప్రాంగణంలో 68 సీసీ కెమెరాలతో నిఘా ఉంచామని సీసీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి 24 గంటలు నిఘా ఉంచుతామని తెలిపారు.దొంగతనాలు జరగకుండా పోలీస్ స్పెషల్ టీమ్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిబ్బంది,టెక్నికల్ టీమ్స్,క్రైమ్ కంట్రోల్ టీమ్స్ ను ఏర్పాటు చేశాం అన్నారు,ప్రత్యేక టీమ్స్ సిబ్బంది మఫ్టీలో తిరుగుతూ అనుమానితులను,కొత్త వ్యక్తులను గుర్తించి దొంగతనాల నివారణకు కృషి చేస్తారని తెలిపారు.మహిళల భద్రతకు సంభందించి షీటీమ్స్ సిబ్బంది అందుబాటులో ఉంటారు,షీటీమ్స్ సాధారణ భక్తుల్లాగ ప్రజల్లో కలిసిపోయి మహిళల పట్ల అసభ్యకరంగా ఎవరైనా ప్రవర్తిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.జాతర ప్రదేశంలో పోలీస్ కంట్రోల్ రూమ్,హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని అత్యవసర సమయంలో పోలీసు సేవలను సద్వినియోగం చేసుకోవడానికి పోలీస్ హెల్ప్ లైన్ సెంటర్లను లేదా అందుబాటులో ఉన్న పోలీసులను సంప్రదించవచ్చని కోరారు.ఎవరైనా తప్పిపోయినట్లయితే కంట్రోల్ రూమ్ ద్వారా సహాయం పొందవచ్చు అని అన్నారు. చెరువు నిండుగా ఉన్నందున చెరువు వైపు ఎవరు వెళ్లకుండా భారీకెడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పిల్లల, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సూర్యాపేట రూరల్ CI రాజశేఖర్, CI లు శ్రీను, రఘువీర్,వీర రాఘవులు,స్థానిక SI మహేశ్వర్, SI లు సాయిరామ్, శ్రీకాంత్,బాలు నాయక్, వీరయ్య,సిబ్బంది ఉన్నారు.