పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 30 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
సూర్యాపేట II టౌన్ పి ఎస్ కేసు.
ఎక్కడున్నా వదిలిపెట్టం!వెస్ట్ బెంగాల్ లో సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేసిన దొంగ
సాయి సంతోషీ జ్యూవెలరిలో బంగారం దొంగతనం కేసులో మరో నింధితుదిని అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీస్,వెస్ట్ బెంగాల్ లో ఆధుపులోకి తీసుకున్న పోలీసులు.దర్యాప్తులో,చాకచక్యంగా పని చేస్తున్న ప్రత్యేక బృందం,వెస్ట్ బెంగాల్ లో సమాచార వనరులు ఏర్పాటు చేసుకుని దొంగలను అరెస్ట్ చేసిన బృందం.ప్రధాన నిందితుడు A-5 జషిముద్దిన్ ను అరెస్ట్ చేసి సుమారు 25 లక్షల విలువగల 25 తులాల బంగారు ఆభరణాలు నగదు రూ.4,84,500/స్వాదినం.ఈ కేసును జిల్లా పోలీస్ అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగలను అరెస్ట్ చేశారు సహకారం లేని,తెలియని ప్రాంతంలో పోలీస్ టీమ్స్ కష్టపడి పని చేసినారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు విలేకరుల సమావేశంలో అరెస్ట్ వివరాలు కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కె నరసింహ. సూర్యాపేట పట్టణం లో సాయి సంతోష్ జువెలర్స్ నందు జరిగిన దొంగతనం కేసును సూర్యాపేట జిల్లా పోలీసు అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పటివరకు నలుగురు దొంగలను అరెస్ట్ చేయడం జరిగినది అని ఎస్పీ కె నరసింహ తెలిపినారు.మొదట అరెస్ట్ చేసిన A7 నిందితురాలు యశోద నుండి 14 తులాల బంగారం,11 వటేదిన వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేసిన A4 నిందితుడు మాలిక్ మొల్ల నుండి సుమారు 55 లక్షల విలువైన 554 (అరకిలో) గ్రాముల బంగారం రూ.87 వేల నగదు,ఖమ్మంలో అరెస్ట్ చేసిన అమర్ బట్ నుండి రూ.5 వేల నగదు,ఇప్పుడు 26 వ తేదిన వెస్ట్ బెంగాల్ లో అరెస్ట్ చేసిన నిందితుడు A5 జషిముద్దిన్ నుండి 25 లక్షల విలువైన 25 తులాల బంగారం రూ.4.85 లక్షల నగదు రికవరీ చేశాము.ఈ కేసును అతి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేశాము,సాంకేతిక ఆధారాలు, వనరులను సద్వినియోగం చేసుకుని ఢిల్లీ,గోవా,జార్ఖండ్,బీహార్,బెంగాల్ రాష్ట్రాల్లో,నేపాల్ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు నిఘా ఉంచి ఇప్పటి వరకు ఈకేసులో ముందుకు వెళ్ళాము. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పట్టణ సిఐ వెంకటయ్య,సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ ల అధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మనకు తెలియని ప్రాంతంలో కష్టపడి పని చేశారు.ఇదే దర్యాప్తు కొనసాగిస్తూ ఈ కేసులో మిగిలిన వారిని కూడా పట్టుబడి చేస్తాం అని ఎస్పీ నరసింహ తెలిపినారు. కేసు వివరాలు:సూర్యాపేట పట్టణంలో జులై నెలలో 21వ తేదిన:ఆదివారం రాత్రి బంగారం షాపులో బంగారం దొంగతనం జరిగింది 2.5 కేజీల బంగారం,డబ్బులు దొంగతనం జరిగినట్లు షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై సూర్యాపేట 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నందు నేరం సంఖ్య 266/2025 ప్రకారం దొంగతనం కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడం జరిగినది.దీనిలో భాగంగా జులై నెల 27వ తేదిన సూర్యాపేట పట్టణంలో అనుమానాస్పదంగా ఉన్న ఖమ్మం పట్టానికి చెందిన 30 సం.రాల A7 యశోద అనే మహిళను అరెస్టు చేసి 14 తులాల బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగినది.యశోద ఒప్పుకోలు ప్రకారం మొత్తం 7 గురు నిందితులు నేరంలో బాగమైనట్లు గుర్తించడం జరిగినది.A1 ప్రకాష్ అనిల్ కుమార్ తో సహా నేపాల్ కు A6 నిందితుడైన అమర్ భట్ట్,వెస్ట్ బెంగాల్ కు చెందిన దొంగలు ఉన్నట్లు గుర్తించి సూర్యాపేట సబ్ డివిజన్ డి.ఎస్.పి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు దర్యాప్తు చేయడం జరిగినది.దీనిలో భాగంగా ఉన్నతాధికారుల అనుమతుల ప్రకారం పోలీసు ప్రత్యేక బృందాలు బీహార్, జార్ఖండ్,వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో,నేపాల్ సరిహద్దుల్లో దొంగల కోసం దర్యాప్తు చేయడం, వెతకడం జరిగినది.సనాకేతిక ఆధారాలతో పోలీసు చాకచక్యమైన దర్యాప్తు నిర్వహించి ఇతర రాష్ట్రాల్లో సమాచార వనరులను ఏర్పాటు చేసుకుని ఈ కేసులో నింధితులైన A4 మాలిక్ మొల్లును ఈనెల 11వ తేదీన వెస్ట్ బెంగాల్ నంధు అరెస్ట్ చేసి 554 గ్రాముల భంగారం రూ,87 వేల నగదు స్వాదినం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరిగినది, అలాగే 16 వతేదీన A6 నిందితుడు అమర్ భట్ ను ఖమ్మం పట్టణంలో అదుపులోకి తీసుకుని రూ.5 వెలు నగదు సీజ్ చేయడం జరిగినది రిమాండ్ కు పంపడం జరిగినది.తదుపరి ఈ కేసు,దర్యాప్తులో భాగంగా,పోలీస్,బృందం మరోసారి చాకచక్యంగా దర్యాప్తు చేసి సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య,సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ ఇరువురి ఆద్వర్యంలో పోలీసు ప్రత్యేక బృందం వెస్ట్ బెంగాల్ కు వెళ్ళి సాంకేతిక ఆధారాలు,నమ్మదగిన సమాచారంతో మరో నింధుతుడైన వెస్ట్ బెంగాల్,మల్దా జిల్లాకు చెందిన A-5 జషిముద్దీన్ వయసు 33 సంవత్సరాలు అనే వ్యక్తిని తేదీ 26-08-2025 రోజున మాల్డా జిల్లా,రత్వా పోలీస్ స్టేషన్ పరిధి,ఒకేరా చాంద్ పరా మండలం అందారు గ్రామం నంధు ఆధుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగినది.A-5 జషిముద్దీన్ నుండి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.4,84,500/నగదు స్వాదినం చేసుకోవడం జరిగినది. వెస్ట్ బెంగాల్ చాచల్ కోర్టులో న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టి 7 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి తీసుకుని నిందితుల రాష్ట్రాల బదిలీ (ట్రాన్సిట్) నిభందనల ప్రకారం ఈరోజు సూర్యాపేటకు తీసుకుని రావడం జరిగినది.ఇతనిని విచారించగా నేపాల్ కు చెందిన A1 ప్రకాశ్ అనిల్ కుమార్, నేపాల్ కు చెందిన A2 కడక్ సింగ్ అహుల్ వాలియ, నేపాల్ కు చెందిన A3 పురన్ ప్రసాద్ జోషి,వెస్ట్ బెంగాల్,మల్దా జిల్లాకు చెందిన A4 మాలిక్ మొల్ల లతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెక్కి చేసుకుని ఎం.జి రోడ్డు నందు గల సాయి సంతోషి జ్యువెలరీ షాప్ వెనుకభాగంలో గ్యాస్ కట్టర్ టి బాత్ రూం గోడకు కన్నం చేసి దొంగతనానికి పాల్పడి బంగారం, నగదు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు.అనంతరం కిరాయికి తీసుకున్న ఇంటికి వెళ్లి దొంగతనం చేసిన సొత్తును 5 భాగాలుగా పంచుకుని A-7 యశోధ మహిళకు,A-6 అమర్ భట్ ఖర్చుల కోసం కొంత బంగారం,డబ్బు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాము అని ఒప్పుకున్నాడు.అలాగే A-6 అమర్ బట్ వాటాకు వచ్చిన బంగారము A-1 ప్రకాష్ అనిల్ కుమార్ వద్ద ఉంచి,నేపాల్ నందు తీసుకునేటట్లుగా అనుకున్నారు అని తెలిపినాడు.A-5 జషిముద్దీన్ ఒప్పుకోలు ప్రకారం వివరాలు నమోదు చేసి ఈరోజు కోర్టు నందు హాజరుపరిచి,రిమాండ్ కు పంపడం జరిగినది.తదుపరి నిందితుల
కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి,త్వరలో నిందితులను పట్టుకుని సొత్తు రికవరీ చేస్తాము.A-5 జషిముద్దీన్ పై గూర్గం పోలీస్ స్టేషన్ నంధు దొంగతనం కేసు ఉన్నట్లు గుర్తించాము.అట్టి కేసు నెంబర్ 189/2023 యు/ఎస్ 328,381 ఐపిసీ ప్రకారము కేసు ఉన్నది. ఈ కేసులో బాగా పని చేసిన సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య,సిసిఎస్ ఇన్ప్సెక్టర్ శివ కుమార్,సైబర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ,సిసిఎస్ హరికృష్ణ,పెనపహాడ్ ఎస్సై గోపికృష్ణ, పట్టణ ఎస్సై శివతేజ,IT కోర్ ఆర్ ఎస్ఐ రాజశేఖర్,హెడ్ కానిస్టేబుల్ కర్ణాకర్, శ్రీరాములు,కృష్ణ,శ్రీనివాస్,పాలకీడు సైదులు,ఆనంద్,మల్లేష్,సతీష్,శివ కృష్ణ,టెక్నికల్ టీం సుధాకర్,సుమర్, సైబర్ సెక్యూరిటీ టీం సైదులు,మహేష్, పట్టణ పోలీసు సిబ్బందీని రివార్డ్ తో అభినందించడం జరిగినది. రికవరీ చేసిన బంగారం,నగదు వివరాలు సుమారు 25 లక్షలు విలువైన 250 గ్రాముల బంగారూ ఆభరణాలు. రూ4,84,500/-నగదు. నిందితుల వివరాలు: A-1 ప్రకాష్ అనిల్ కుమార్ S/o ప్రకాష్ బందరి,వయసు :42 సం:లు,కులం: బందరి,వృత్తి: గూర్కా సాకిత్ రోడ్,గంణపతి,కోయంబత్తూర్, తమిళనాడు దేవుర,రాయల్,నేపాల్.A-2 కడాక్ సింగ్ అలియాస్ కడాక్ ఆహులిహలియ రాయల్,నేపాల్.A-3 పురన్ ప్రసాద్ జోషి రాయల్ నేపాల్.A-4 మాలిక్ మొల్ల వెస్ట్ బెంగాల్ రాష్ట్రం దక్షిన్ దినాస్ పుర్ జిల్లా,బైహోర్ విలేజ్,స్కూల్ పరహ పోస్ట్,బికనూర్ మండలం, తపన్ పోలీస్ స్టేషన్.అరెస్టు డే 16.08.2025:A-5 జషిముద్దిన్,వయస్సు 33 సంవత్సరాలు రత్వా పోలీస్ స్టేషన్ పరిధి,ఒకేరా చాంద్-పరా మండలం అందారు గ్రామం,మల్దా జిల్లా,వెస్ట్ బెంగాల్.అరెస్టు డే 26.08.2025:A-6 మట్టి అమర్ వయసు:43 సం:లు,కులం:బ్రాహ్మిన్, వృత్తి:గూర్కా,టీచర్స్ కాలనీ,ఖమ్మం దౌల గ్రామం,చబిష్,పతిబార,బజ్గంగ్ జిల్లా,నేపాల్.అరెస్టు డే 16.08.2025 A-7 మేకల యశోద W/oశ్రీను, వయసు:30 సం:లు,కులం:ఏరుకల, వృత్తి:లేబర్ వర్క్ నాయుడుపేట, ఖమ్మం..