పయనించే సూర్యుడు అక్టోబర్ 7 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట లో స్థానిక శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ఈరోజు అనందా లాలీ కృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పులి ఝాన్సీ రాణి నేతృత్వంలో ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వయంగా సేవచేసిన ట్రస్ట్ సభ్యులు, భక్తులకు భోజనం పెట్టి సత్సేవలో భాగమయ్యారు. సేవాస్ఫూర్తితో సమాజంలో మార్పు తీసుకురావడమే తమ లక్ష్యమని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రాంగ్రస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి కన్నబాకం హరికృష్ణ, యువ నాయకుడు వల్లం శరత్ కుమార్ పలువురు సేవాభావంతో పాల్గొని ట్రస్ట్ నిర్వహణను అభినందించారు.