పయనించే సూర్యుడు జూలై 13 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని మహదేవయ్య నగర్, క్రిస్టియన్ పేట ప్రాంతాల్లో ఆదివారం ఉదయం పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎటువంటి పత్రాలు లేని టూ వీలర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలో సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ, సూళ్లూరుపేట ఎస్సై బ్రహ్మనాయుడు, తడ ఎస్సై కొండప్ప నాయుడు, సూళ్లూరుపేట సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచడమే లక్ష్యంగా సెర్చ్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.