పయనించే సూర్యుడు అక్టోబర్ 23 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టగా తీసుకొని పిల్లలకి అన్ని వసతులు సమకూర్చి పిల్లల్ని భావితరాలకు మార్గదర్శకంగా చెయ్యాలని ప్రయత్నిస్తుంది కానీ తల్లిదండ్రుల ఆవేదన గురించి కూడా ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి తల్లిదండ్రుల ఆవేదన మాకు ఉన్న పిల్లల్ని గురుకుల పాఠశాలలో చేర్పిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని గురుకులంలో చేర్పించాం కానీ మా పిల్లల్ని నెలకు ఒకసారి గాని 15 రోజులకు ఒకసారి గాని గురుకులం దగ్గరికి మేము వస్తే కనీసం చూడటానికి వీలు లేకుండా ఉంది మేము కూలినాలు చేసుకొని పిల్లలకి మంచి చదువు చెప్పించలేకపోయాం ప్రభుత్వ స్పందించి గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి వాళ్లకి మంచి భవిష్యత్తు ఇస్తుంది కానీ కన్నవాళ్ళకి నెలకు ఒకసారైనా 15 రోజులకు ఒకసారి అయినా చూపిస్తే మా మనసు ప్రశాంతంగా ఉంటుంది (పొద్దున 8 గంటలకు వచ్చి రాత్రి 8 గంటల వరకు పడికాపులు కాయాల్సి వస్తుంది ) ఉన్నత అధికారులు స్పందించి మా బాధను అర్థం చేసుకొని మా పిల్లల్ని చూసుకునే సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాము