పయనించే సూర్యుడు అక్టోబర్ 3 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
అక్టోబర్-02 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట పురపాలక కార్యలయములో కమిషనర్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ముందుగా పురపాలక కార్యాలయము నందు మహాత్మా గాంధీ చిత్రపట్టం కి పూలమాల వేసి నివాళులర్పించారు తదుపరి పురపాలక సంఘం నందు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహముకు పూలమాల వేసిన సందర్బంగా సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె . చిన్నయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్వచ్ఛత కు ఇచ్చిన ప్రధాన్యత ను వివరించారు. అదేవిదంగా మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని స్వచ్ఛ సూళ్లూరుపేటగా తీర్చిదిద్దాలని సిబ్బంది చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో శానిటరీ ఇన్స్పెక్టర్ మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.