
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకాముగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర (SASA) కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 10 మరియు 20 తారీఖు న E-వేస్ట్ సేకరణ జరుగుతుంది. సూళ్లూరుపేట పురపాలక సంఘం తేదీ: 20.02.2026 శుక్రవారం న సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం అయినటువంటి e-వేస్ట్ నిర్వహణపై ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఇంటింటి నుండి పారిశుధ్య కార్మికుల ద్వారా దాదాపు 77 కిలోల e-వెస్ట్ సేకరించడమైనది. సేకరించిన E- వేస్ట్ ను రీసైక్లింగ్ కు పంపించడం జరుగుతుంది. వార్డు సచివాలయ సిబ్బంది, RP లు, SHG మెంబర్స్ ద్వారా e - వెస్ట్ నిర్వహణపై జరిగినది అటులనే పుర ప్రజలకు E- వేస్ట్ అనేవి చాలా ప్రమాదకరమైనవి అని అవగాహన కల్పించడం జరిగినది. సూళ్లూరుపేట పుర ప్రజలు ఇంకను E- వేస్ట్ ఉనచో మీ యొక్క సచివాలయం నందు గాని లేదా సూళ్లూరుపేట పురపాలక పారిశుధ్య కార్మికులకు గానీ అందించవలసినదిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.