
పయనించే సూర్యుడు డిసెంబర్ 20 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 20-12-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు థీమ్ డిసెంబర్ –2025 "OPPORTUNITIES IN ENVIRONMENT" పర్యావరణ రంగంలో అవకాశాలు అనే కార్యక్రమం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ కె.చిన్నయ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొని సూళ్లూరుపేట పురపాలక సంఘ కార్యాలయంలో మొక్కని నాటి కార్యక్రమమును ప్రారంభించారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ పట్టణంలోనీ దుకాణ యజమానులు మరియు ప్రజలు సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణను మేలు చేసే బయో కాంపోస్టబుల్ కవర్లు మరియు పర్యావరణను హాని చేయని జ్యూట్ బ్యాగ్స్ వాడాలని తెలియజేశారు మరియు ఈ కార్యక్రమమును ఉద్దేశించి SAVE GREENCO BAGS ప్రొప్రైటర్ మరియు వ్యవస్థాపకులు శ్రీ సయ్యద్ గుల్షన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ చేసే పర్యావరణకు హాని మరియు బయో కాంపోస్టబుల్ కవర్లు పర్యావరణకు చేసే మేలు పి.పి.టి ద్వారా వివరించారు అట్లాగే MGR HANDICRAFTS వ్యవస్థాపకులు శ్రీమతి ఝాన్సి జ్యూట్ బ్యాగ్స్ యొక్క ఉపయోగాలు పి.పి.టి ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ పలువురు పారిశుధ్య కార్మికులకు సన్మానం చేశారు మరియు జ్యూట్ బ్యాగ్స్ ను MGR HANDICRAFTS ద్వారా పలువురు ప్రజా ప్రతినిధులు,వ్యాపార సంఘాల నాయకులకు మరియు మున్సిపల్ సిబ్బందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపార సంఘాలు, కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది.
