పయనించే సూర్యుడు అక్టోబర్ 18( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట పురపాలక సంఘ0 పరిధిలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా ఈరోజు తేదీ. 18-10-2025న సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు "CLEAN AIR" అనే కార్యక్రము నిర్వహించడం జరిగింది. సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో గల అన్ని వార్డులలో చెట్లు నాటడం, డివైడర్లు మరియు కాలిబాట యందు పిచ్చి మొక్కలు శుబ్రం చేయించుట జరిగినది. పట్టణ వీధుల యందు వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో భాగముగా స్థానిక గోవర్నమెంట్ హై - స్కూల్ నందు మరియు తేజ హై-స్కూల్ సూళ్లూరుపేట నందు విద్యార్థులుచే సైక్లింగ్ చేసి ప్రతిజ్ఞ చెప్పించారు పుర ప్రజలు కూడా కాలుష్య నియంత్రణ కోసం మోటార్ బైక్లు వాడకం తగ్గించి వాటి బదులు సైకిళ్లు వాడాలని సూళ్లూరుపేట పురపాలక సంఘం కమిషనర్ కె.చిన్నయ తెలియజేశారు మరియు సదరు కార్యక్రమమును ఉద్దేశించి దీపావళి పర్యావరణం కాపాడే విధముగా గ్రీన్ దీపావళి జరుపుకోవాలని మరియు వర్షాకాలం నందు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు పరిసరాల పరిశుభ్రత గురించి వివరించడం జరిగినది. అటులనే సూళ్లూరుపేట పురపాలక సంఘంలో ప్రతి సచివాలయం యందు సెక్రటర్ల చే మరియు మెప్మ ఆర్.పి లతో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ మరియు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, వార్డు ఎన్విరాన్మెంట్ అండ్ శానిటేషన్ సెక్రటరీలు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, శానిటరీ మేస్త్రీలు, మెప్మ సిబ్బంది మరియు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.