
పయనించే సూర్యుడు ఆగస్టు 25 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట
మున్సిపాలిటీ పరిధిలోని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే నిద్రపోతున్న మున్సిపాలిటీ యంత్రాంగం ఒక మున్సిపాలిటీలో ఎన్నో ప్రాబ్లం ఉన్నా మనకెందుకులే అని సేద తీర్చుకుంటున్న మున్సిపాలిటీ యంత్రాంగం ప్రాబ్లం ని చూస్తే కదా కంటికి కనిపిస్తుంది ఇలాంటి మున్సిపల్ అధికారులు ఉన్నంతవరకు సూళ్లూరుపేట ఎక్కడ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మన్నారుపోలూరు లోన్యూ కాలనీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.చిన్నపాటి వర్షానికే రహదారులు మోకాలిలోతు బురదనీటితో నిండిపోతున్నాయి.వర్షం ఆగిపోయినా మురికినీరు నెలల తరబడి రోడ్లపైనే నిలిచిపోతోంది.దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు రాకపోకలకు నానా అవస్థలు పడుతున్నారు.నిల్వ నీటితో దోమలు విజృంభించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామానికే ఇలాంటి దుస్థితి రావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండి పడుతున్నారు.కాలనీ రహదారులు రాకపోకలకు పనికిరాకుండా మారినా సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మురుగునీటి సమస్యతో పాటు పారిశుద్ధ్యం కూడా పూర్తిగా దెబ్బతిన్నదని స్థానికులు చెబుతున్నారు.మున్సిపాలిటీ పరిధిలోనే ప్రజలకు కనీస రహదారి సౌకర్యం లేకపోవడం అధికారుల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు రేకెత్తిస్తోంది.ఇప్పటికైనా అధికారులు కళ్లుతెరిచి తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే సమస్యపై ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. మన్నారు పోలూరు న్యూ కాలనీ సమస్యకు తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.