
పయనించే సూర్యుడు జూలై 22 (సూళ్లూరు పేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరు పేట మున్సిపాలిటీ పరిధిలో ఫోన్లో రీల్స్ చూస్తూ విధుల్లో అలసత్వం టికెట్ కోసం వేచి చూసిన ప్రయాణికుల ఆవేదన.సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో టికెట్ కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి నిర్లక్ష్య వైఖరి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ కోసం కౌంటర్‌కు వచ్చిన ప్రయాణికులను పట్టించుకోకుండా ఫోన్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తున్నాడని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుసూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో రోజూ వందలాది మంది ప్రయాణికులు టికెట్లు కొనుగోలు చేసేందుకు టికెట్ కౌంటర్‌ను ఆశ్రయిస్తుంటారు అయితే కౌంటర్లో ఉన్న ఉద్యోగి ప్రయాణికులు టికెట్ కోరుతున్నప్పటికీ స్పందించకుండా మొబైల్ ఫోన్లో రీల్స్ చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు యూపీఐ ద్వారా నగదు రహితంగా టికెట్ చెల్లించి పొందే సౌకర్యం ఉన్నప్పటికీ, దానికి సంబంధించిన వివరాలు అడిగిన ప్రయాణికులకు కూడా సరైన సమాధానం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా మాట్లాడు తున్నారని వారు చెబుతున్నారు. దీంతో టికెట్ తీసుకోవడంలో ఆలస్యం జరిగి, రైళ్లను అందుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు