
పయనించే సూర్యుడు మార్చి 3 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సీఐ టీయూ నాయకుల ఆధ్వర్యంలో ఎర్రజెండాలు చేతపట్టి ఆశ వర్కర్లకు జరుగుతున్న అన్యాయం మీద మాకు న్యాయం చేయాలని ప్రభుత్వం దిగివచ్చి మాకు న్యాయం చేసేదాకా పోరాటం కొనసాగిస్తామని ఎర్రజెండాలతో నిరసన తెలియజేస్తున్నారు సీఐటీయూ మండల కార్యదర్శి లక్ష్మయ్య, సిఐటి యూ నాయకులు పద్మనాభం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీస వేతనాలు పెంపు ఉద్యోగ భద్రత పెన్షన్ హక్కులు వంటివి డిమాండ్లను వెంటనే అమలు చేయాలని కోరారు సమస్య కోసం మా వాళ్లు విజయవాడలో పోరాటం చేస్తుంటే వచ్చిన వాళ్ళని కనీసం మర్యాద కూడా ఇవ్వకుండా బూటకపు అరెస్టులను ఖండిస్తూ సీఐటీ యూ నాయకులు తో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసనకు స్పందించిన ఎడల రాష్ట్రంలో ఉన్న నాయకులు ఆశా వర్కర్స్ ముక్కుముడి నిరసన తెలియజేయాల్సి వస్తది ఈ కార్యక్రమంలో అంగనవాడి ఆశా వర్కర్స్ సుభాషిని , చెంగమ్మ. శశికళ, పుష్ప రాణి . తదితరులు పాల్గొన్నారు
