
పయనించే సూర్యుడు జూన్ 29 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిధిలో ఏ భూమి నైనా దోచేయవచ్చు మన వాళ్ళని అడిగే అధికారం ఏ ఒక్కరికి లేదు ఎక్కడ నుంచో వచ్చిన ఇక్కడ సూళ్లూరుపేట ప్రాంతంలో కొత్తగా లేఔట్ లు వేస్తూ గవర్నమెంట్ భూమిని కూడా కబ్జా చేస్తున్నారు సూళ్లూరుపేట మండల పరిధిలోని కుదిరి నరసిం హుని గుంట(గ్రామం)లో సర్వే నంబర్: . 69 లో 0.59 సెంట్లు, 73-1 లో 0.76 ,73-2 లో 0.8 సెంట్లు మొత్తం 1.43 సెంట్లు ప్రభుత్వ భూమి నీ ఆక్రమించారు ఈ భూమిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే బండ్ల బాటగా గుర్తింపు పొందిన గ్రామ డొంక ను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకొని ప్రహరీ గోడలు మరియు గేట్లు నిర్మించి పూర్తిగా రాకపోకలు లేకుండా చేశారు కానీ ప్రభుత్వ అధికారులలో ఎలాంటి స్పందన లేదు , అదే స్థానిక నివాసి నివాస స్థలం లేక 2 సెంట్లు ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకుంటే ప్రభుత్వ అధికారులు వెంటనే వచ్చి ఆ గుడిసె ని పీకేస్తారు పేదవాడికి ఒక న్యాయం ఉన్నవాడు ఒక న్యాయమా ? కనుక ఈ ప్రభుత్వ భూమి ఆక్రమార్ధాలుపై రెవెన్యూ అధికారులు సంబంధిత ప్రభుత్వ అధికారులు వెంటనే చర్య తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు నెల్లూరు నుంచి వచ్చిన ఒక పెద్ద దొర లోకల్ గా ఉన్న కొంతమందిని పోగొచేసుకొని ఒక లేఔట్ సృష్టించారు బడా బాబులు ఏం చెప్తే అదే శాసనం లాగా ఉన్న సూళ్లూరుపేట అధికారులు గానీ అధికార పార్టీ వాళ్లు గానీ కన్నెత్తి కూడా చూడరు అధికారుల్ని అధికార పార్టీ వాళ్ళని ముడుపులతో మాయ చేస్తున్న దొరలు భూమి కనబడిందంటే దొరల ఆధీనంలోకి వెళ్లి పోవాల్సిందే నీ దొరల పాలన అరికట్టే నాధుడు ఎవరు సూళ్లూరుపేట మండలం ని దొరల ఆధీనంలో నుంచి కాపాడేదెవరు ఈ దొరలు నీ తరిమి కొట్టాలంటే నిజాయితీతో కూడుకున్న అధికారులు ఉండాలి సూళ్లూరుపేట మండలంలో నిజాయితీని భూస్థాపితం చేసిన అధికారులు ఉన్నారు ముడుపుల తో లొంగిపోయి అధికారులు ఉన్నంతవరకు సూళ్లూరు పేటని భగవంతుడు కూడా మార్చలేరు అదే పేద ప్రజలు ఏదైనా చిన్న తప్పు చేస్తే ఊరు ఉంటారా ఇకనైనా అధికారులు మేల్కొని ముడుపులు మాటా పక్కనపెట్టి ప్రజలకి ప్రభుత్వ భూమిని కాపాడండి మహాప్రభువు అని సూళ్లూరుపేట ప్రజలు అనుకుంటున్నారు