పయనించే సూర్యుడు ఆగస్టు 15 (సూళ్లూరుపేట మండలం రిపోర్టర్, దాసు) :
15.08.2025న 79 వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉదయం 10.00 గంటలకు సూళ్ళూరుపేట పురపాలక సంఘ కార్యాలయము నందు నిర్వహించారు . ఈ కార్యక్రమమునకు సూళ్ళూరుపేట శాసన సభ్యురాలు శ్రీమతి నెలవల విజయశ్రీ ముఖ్యఅతిథి హజరయ్యారు. సూళ్ళూరుపేట పురపాలక సంఘం చైర్ పర్సన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి వారిచే జాతీయ పతాక ఆవిష్కరణ పూర్తయిన తర్వాత సూళ్ళూరుపేట శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధులు స్మరించుకున్నారు. వారి యొక్క త్యాగాలు స్పూర్తిగా తీసుకొని దేశ ప్రజలు అందరూ భారత దేశాని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్ కె. చిన్నయ్య వైస్ చైర్మన్, కౌన్సిలర్ల, టీడీపీ నాయకులు మున్సిపల్ సిబ్బంది మరియు మెప్మ సిబ్బంది పాల్గొనడం జరిగినది.