పేగ నుండి ఏడుగురాళ్ళ పల్లి బిటి రోడ్డు పోయడానికి అటవీ శాఖ అనుమతులు ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తా
50 సంవత్సరాల ముందు నుండి ఉన్న రోడ్డుకు పైన తారు వెయ్యడానికి అనుమతులు ఏంటి
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ సెప్టెంబర్ 1
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంఈరోజు పేగ పంచాయతీ పీసా కమిటీ ఆధ్వర్యంలో సూరకుంట కమ్యూనిటీ భవనంలో జరిగిన సమావేశంలో "పేగ నుండి ఏడుగురాళ్ల పల్లి వరకు 6 కి మీటర్ల బిటి రోడ్డు మరియు సరివెల నుండి పేగ వరకు 10 కిలోమీటర్లు ఈ రెండు రోడ్ల సమస్యల పై ముఖ్య సమావేశం జరిగింది .ఈ సమావేశంలో పేగ పంచాయతీ కమిటీ మాట్లాడుతూ ప్రభుత్వాలు చుట్టూ తిరిగిన మా రోడ్డు సమస్యలను ప్రభుత్వం పరిష్కారం చూపట్లేదు, మేము పడుతున్న కష్టాలను ప్రభుత్వాలు గుర్తించట్లేదు అన్నారు. సర్పంచ్ పాయం చంద్రయ్య మాట్లాడుతూ దరఖాస్తులు ఎన్నో సార్లు ప్రభుత్వాలకు ఇచ్చిన చీమకుటినట్లు కూడా లేదన్నారు మా సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అన్నారు.5వ షెడ్యూల్ ప్రాంతాలలో ఉన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు.పేగ నుండి ఏడుగురాళ్ల పల్లి రోడ్డు బిటి రోడ్డు మంజూరు అయినప్పటికీ అట్టవిశాఖ అనుమతుల కావాలంటూ కాలయాపనం చేస్తూ మా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. అదే మల్లం పేట ప్రాంతాలలో మైనింగ్ ఉండి ఉంటే వెంటనే రోడ్లు వేసే వారు , అదే బడా బాబులు రిసార్ట్స్ వేస్తానంటే అనుమతులు ఉంటాయి కానీ సామాన్య ప్రజల ఆస్పత్రులకు ,కార్యాలయాలకు వెళ్ళడానికి రోడ్డుకు మాత్రం అనుమతులు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదని పేగ పంచాయతీ పీసా కమిటీ దుయ్యబట్టింది .సెప్టెంబర్ 7 వ తేదీ లోపు మా రోడ్లకు ప్రభుత్వం అటవీ శాఖ నుండి అనుమతులు ఇప్పించక పోతే పేగ, ఏడుగురాళ్ల పల్లి, లాచిగూడెం పంచాయతీలు 19 గ్రామాల ప్రజలతో ఐటిడిఏ ను ముట్టడిస్తాం అన్నారు. ఈ కార్యక్రమమని 18 గ్రామాల పూజారిలు,పెద్దలు, పీసా కమిటీలు మరియు వార్డు మెంబర్లు, పేగ పంచాయతీ యూత్ కమిటీ పాల్గొన్నారు ..