పి.వై.ఎల్.రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 24 (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి:ఈనెల 25,26న సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం లో జరిగే ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని పి. వై. యల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్ పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ఈ దేశ భవిష్యత్తు యువత మీదనే ఆధారపడి ఉందని నేడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాలలో మార్పుల వలన నిరుద్యోగం పెరిగిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. చదువుకున్న చదువులకు ఉద్యోగాలు లేఖ రాత్రింబవళ్లు కష్టపడి కనిపెంచిన తల్లిదండ్రులకు కనీసం బువ్వ కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని మరోపక్క ఏఐ పేరుతో ఉన్న ఉద్యోగాలను కూడా తీసివేస్తున్నారని వారు అన్నారు. ఈ క్రమంలోనే యువతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని హిందూ మతోన్మాదం పేరుతో యువతను రెచ్చగొడుతూ ఉద్యోగాలు ఇవ్వకుండా కులం, మతం, మద్యం, డ్రగ్స్ మత్తులో యువతను పెంచి పోషిస్తున్నారని ఆయన అన్నారు. కావున ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంగం మీదనే ఉన్నదని అలాంటి యువతరం ముందుకు రావాలని వారి రాజకీయ చైతన్యం కోసం దేశంలో జరుగుతున్న మార్పుల పై ఈ నెల 25, 26న సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం కేంద్రంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్యవక్తలుగా నిర్మాణం- పని విధానం బండారు ఐలయ్య ,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మార్క్సిస్ట్ మాహోపాధ్యాయులు ఆవునూరి మధు,నిరుద్యోగ సమస్య మన కర్తవ్యం గౌని ఐలయ్య సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మతం ఫాసిజం అంబటి నాగయ్య టీవీవి రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు జేవీ చలపతిరావు గారు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, పాల్గొని బోధిస్తారని ఆయన అన్నారు . కానుక యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం.