ఆకట్టుకున్న చిన్నారుల ఆట పాటలు..
సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులు..
పయనించే సూర్యడు // మార్చ్ // 4 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
సెయింట్ థామస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ హేమలత, హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను అందించారు. చిన్నారులు పట్టాలను అందుకుని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.