చేసి తక్షణమే చర్యలు తీసుకోవాలని, డిఎస్ఎఫ్ , ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్.
పయనించే, సూర్యుడు సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ.
అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా…. డి ఎస్ ఎఫ్, ఆర్ పి ఎస్ ఎఫ్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ ధర్నా ను ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ ఆర్ పి ఎస్ ఎఫ్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ.. పాఠశాల ముందు ఫీజుల పట్టిక బహిరంగంగా వేయాలి. అలాగే స్కూల్ ఫీజు యూనిఫామ్ ఫీజు బుక్స్ ఫీజు ఎంత తీసుకుంటున్నారో అనే విషయం పైన తక్షణమే విచారం చేయాలి, అలగే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ చైతన్య పాఠశాల సెలవు దినాల్లో తరగతులు నడుపుతున్న కూడా ప్రభుత్వ జిల్లా విద్యా శాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు….?? ఇవాళ అనేక రకాలుగా సెలవు దినాల్లో కూడా చదువు పేరుతో విద్యార్థులకు చదువుల పేరుతో ఒత్తిడి చేస్తూ చైతన్య పాఠశాల లో సెలవు దినాల్లో కూడా తరగతులు కొనసాగించడం చాలా దారుణం, కావున విద్యార్థులకు చదువు అనే ఒత్తిడి లేకుండా విద్యార్థులకు చదువుతోపాటు ఆరోగ్యం ఆలాగే విద్యార్థులు ఒత్తిడికి గురై సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అని, డి ఎస్ ఎఫ్ , ఆర్ పి ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘంగా కోరుతున్నాము…అలాంటి ఒత్తిడి విద్యార్థులకు లేకుండా చూడాల్సిన అవసరం విద్య అధికారులకు ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం లేనిపక్షంలో డీఈవో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సృష్టిస్తామని మరొక్కసారి జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో డిఎస్ఎఫ్ నాయకులు గిడ్డయ్య వినోద్ సూరి తదితరులు పాల్గొన్నారు.