పయనించే సూర్యుడు -రాజంపేట న్యూస్ ఆగష్టు 25 : ఈనెల 28 29 30వ తేదీలలో విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోవు "సేనతో సేనాని" కార్యక్రమాల పోస్టర్లను జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు యల్లటూరు భవన్ నందు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడం, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మామిళ్ళ రవి, ఆకుల చలపతి, గాజుల కులాయప్ప, పి.వి.ఆర్ కుమార్, పెడకాల సుధాకర్ రాయల్, మన్నేరు వెంకటసుబ్బయ్య, పలుకూరి శంకర్, కొండేటి రవికుమార్, మౌలా, పత్తి నారాయణ, పూల లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటో రైట్ అప్ : పోస్టర్లు ఆవిష్కరిస్తున్న యల్లటూరు శివరామరాజు