
సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ టీవీ రంగయ్య పర్యవేక్షణలో చిత్రీకరణ
రాత్లావత్ శంకర్ స్వయంగా రచించి నిర్మిస్తున్న పాట
( పయనించే సూర్యుడు జనవరి 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గిరాయి గుట్ట తండా జాతరలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రీకరించిన వీడియో సాంగ్ నేటితో ముగిసింది. కడియాల కుంట తండా కు చెందిన రాత్లావత్ శంకర్ రచించిన ఈ పాటని కొరియోగ్రాఫర్ శివా ( రవీందర్) నాయక్ ఆధ్వర్యంలో చిత్రీకరణ పూర్తి అవ్వడం జరిగింది. ఈ పాటను సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ టీవీ రంగయ్య పర్యవేక్షణలో చిత్రీకరించడం జరిగింది. కాన్సన్ పల్లి సర్పంచ్ హరి మరియు వార్డ్ నెంబర్ మెలోడీ మురళి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ టీవీ రంగయ్య, సర్పంచ్ హరి, వార్డ్ నెంబర్ మురళి, ప్రొడ్యూసర్ చిట్టి రాథోడ్,పాట రచయిత రాత్లావత్ శంకర్ డిఓపి శ్రీను, కొరియోగ్రాఫర్ శివ, సురేఖ రాథోడ్, సీనియర్ డాన్సర్ నరేందర్ నాయక్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.
