మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ జన్మదిన సందర్భంగా పెద్ద సంఖ్యలో రక్తదానం చేసిన అభిమానులు
షాద్ నగర్ పట్టణం రెడ్ రోజ్ ఫంక్షనల్ లో ఏర్పాటుచేసిన రక్త దాన శిబిరానికి అపూర్వ స్పందన
దేశ సైనికుల కోసం స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేసిన యువకులు, నాయకులు
రక్తదాతలను మనస్ఫూర్తిగా అభినందించిన మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్
( పయనించే సూర్యుడు మే 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) మన దేశం కోసం, మనకోసం ప్రాణాలను అడ్డుపెట్టి శత్రుదేశంతో పోరాడుతున్న భారత సైనికులకు మనమందరం అండగా నిలిచే సమయం వచ్చిందని మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. తన జన్మదినం సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. 146 మంది స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడం జరిగింది. శత్రు దేశమైన పాకిస్తాన్ ప్రభుత్వం కుట్ర పూరితతో, ఐక్యరాజ్యసమితి సైతం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా, దేశ సరిహద్దు ప్రాంతాలలో కాల్పులకు పాల్పడుతూ అమాయక ప్రజల ప్రాణాలతో పాటు భారత సైనికుల ప్రాణాలను తీసుకోవడం అత్యంత బాధాకరమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన సాయుధ దళాల పోరాటపటిమ తీరుతో దేశ ప్రజలు గర్విస్తున్నారని, ఇదే సమయంలో మనమందరం దేశానికి, దేశ సైనికులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. యుద్ధంలో పోరాడుతూ ఎంతోమంది సైనికులు తీవ్ర గాయాలపాలై, రక్తలేమితో ఇబ్బందులకు గురవుతారని, సైనికులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాల ప్రజలు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నా జన్మదినం సందర్భంగా పెద్ద సంఖ్యలో, స్వచ్ఛందంగా వివిధ గ్రామాల యువకులు, కార్యకర్తలు రక్తదానం చేయడం చాలా సంతోషకరమని అభిప్రాయపడ్డారు. దాతలు ఇచ్చే రక్తం దేశ సైనికుల కోసం వినియోగించేలా రక్తదాన శిబిర నిర్వాహకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఊహించిన దాని కంటే పెద్ద మొత్తంలో తమ రక్తాన్ని దానం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు, యువకులు ముందుకు రావడం అభినందనీయమని, దాతల పనితీరు ఆదర్శనీయమని కొనియాడారు. ఈ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.