
రోడ్ సేఫ్టీ,, డ్రగ్స్ వాటిపై అవగాహన
కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ముమ్మిడివరం ప్రతినిధి. గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమp జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపిఎస్ వారు ఆదేశాల మేరకు, అమలాపురం డిఎస్పి టీఎస్ ఆర్కే ప్రసాద్ మరియు ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ వారి పర్యవేక్షణలో, కాట్రేనికోన గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ పాల్గొని సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రత, మరియు మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల గురించి విద్యార్థులకు క్లుప్తంగా వివరించారు.
కార్యక్రమంలోని ముఖ్యాంశాలు:సైబర్ నేరాలు: సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయకూడదని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని ఎస్సై హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే '1930' నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
రోడ్డు భద్రత: మైనర్లు వాహనాలు నడపకూడదని, రహదారి నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను అరికట్టవచ్చని తెలిపారు. హెల్మెట్ ధరించడం మరియు అతివేగాన్ని నియంత్రించుకోవడంపై అవగాహన కల్పించారు.మహిళలు & చిన్నారుల రక్షణ: మహిళలు మరియు చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాల గురించి వివరించారు. ఏదైనా ఆపద కలిగితే '100' లేదా '112' నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్' పట్ల చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, పోలీస్ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
