పయనించే సూర్యుడు ఏప్రిల్ 18 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం కిష్టారం గ్రామస్తులు తమ సొంత ఖర్చులతో జేసీబీ పెట్టి. వాగులో రాళ్ల తొలగించు కుంటూ దారి శుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమస్య విషయంలో వేరొకరికి చెప్పడం కంటే మనం చేసుకోవడం మేలు అనుకున్నారు, మొర్రేడు వాగు దాటడం కోసం. ఆను నిత్యం ఒక పెద్ద పోరాటమే జరుగుతున్నది. వర్షాకాలం వాగులు వచ్చి కష్టాలు. అవి తగ్గినాక మొత్తం రాళ్లు తేలి నడవడానికి కష్టంగా ఉంటుందని వాగు దాటటము అంటే ఒక పెద్ద ఎవరెస్టు ఎక్కినంత కష్టమవుతుందని, పశువులు, పిల్లలు, పెద్దవాళ్లు, అనునిత్యం పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుందని, అందుకే తాత్కాలిక రాకపోకడలు జరగడం కోసం. ఈ పని చేస్తున్నామని వారు తెలియజేశారు పెద్దమనుషులు:- కంగల భద్రయ్య చింతా నాగేశ్వరరావు కోర్స రాజు జోగ పోశం వేప పమిడయ్య
యువత:- చింతా మధు కంగల పెంటరావు కంగల మంగయ్య జోగు చంటి తదితరులు పాల్గొన్నారు