పయనించే సూర్యుడు; మే25: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి అట్టం. వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని మురుమూరు పంచాయతీలోని అరుణాచల పురం గ్రామంలో గత నాలుగు రోజులుగా ఇష్టం వచ్చినట్టుగా మట్టి మాఫియా సృష్టించి మట్టితోలుతున్నారు ఈ యొక్క విషయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ అని అడిగిన కూడా సరైన సమాధానం లేకపోవడంతో పత్రిక ముఖంగా గ్రామస్తులు అడుగుతున్నారు. అసలు ఎందుకు మట్టి తోలుతున్నారు దాని గురించి మీడియా మిత్రులు మాట్లాడిన కూడా సరైన సమాధానం ఇవ్వకుండా ఇష్టం వచ్చిన సమాధానాలు ఇస్తూ బెదిరిస్తూ మీడియా మిత్రులకు బెదిరిస్తూ ఇష్టం వచ్చినటువంటి సమాధానాలు చెబుతూ మీడియా మిత్రులు బెదిరిస్తున్నారని మీడియా వ్యక్తులు తెలియజేశారు దయచేసి సంబంధిత కనీస చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.