పట్టించుకోండి కలెక్టర్ సారు
పయనించే సూర్యుడు మార్చి 18 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆత్మకూరు మత్స్య శాఖ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ సోమశిల ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో కొందరు మత్స్యకారులు యధావిధిగా అలవి వలలు వేస్తూ మత్స్య సంపదను దోచుకుంటున్నారు. దాంతో సాంప్రదాయ వలలు వేసి చేపలు పట్టుకుంటున్న మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతూ ఉన్నామని లబోదిబోమంటున్నారు. వివరాల్లోకెళితే నెల్లూరు జిల్లా వరప్రసాద్‌ని అయిన సోమశిల ప్రాజెక్టు జలాశయంలో ప్రభుత్వం అలవి వలల వేట నిషేధించిన విషయం తెలిసిందే. చిన్నచిన్న వలలు వేసి చాపలు పట్టుకొని మత్య కారులు ఎక్కువ మంది జీవించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే అందుకు విరుద్ధంగా కొంతమంది ఇతర జిల్లాల నుంచి సోమశిల కు వచ్చి అలివివలలు వేస్తూ ప్రతిరోజు టన్నుల కొలది చేపలను పట్టి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని స్థానిక మత్స్యకారుల ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల ఫిర్యాదు మేరకు ఇటీవల మత్స్యశాఖ జేడీ నాగేశ్వరరావు ప్రాజెక్టు వద్దకు వచ్చి జలాశయంలో పరిశీలించి అలవి వలలు వేస్తూ చేపలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించి వెళ్లిన విషయం విధితమే. అయితే వారం తిరక్క ముందే మళ్లీ జలాశయంలో అలవి వలలు వేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. పోలీస్ అధికారులు మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అక్రమ చేపల వేట కొనసాగిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి ఈ ప్రాంత మచ్చకారుల జీవనోపాధికి గండిపడకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అధికారులను అప్రమత్తం చేయాలని అలవి వలలు వేస్తున్న మత్స్యకారులు పై కఠినచర్యలుతీసుకోవాలని కోరుతున్నారు.
మత్స్య శాఖ కార్యాలయంలో ఖాళీగా ఇన్స్పెక్టర్ పోస్ట్ సోమశిల ప్రాజెక్టు వద్ద మత్స్య శాఖ ఇన్స్పెక్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదని అందువల్ల అక్రమ చేపల వేటకారులు యదేచ్చగా అలవి వలలు వేట కొనసాగిస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఇన్చార్జి గా ఐదేళ్లుగా మత్స్యశాఖ కావలి ఏడి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అందువల్ల ప్రాజెక్టు వద్ద అలవి వల్లలు వేస్తున్న మత్స్యకారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.