పయనించే సూర్యుడు ఆగస్టు 8( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
సోలార్ విద్యుత్ యూనిట్ ఏర్పాటుతో విద్యుత్ ఉత్పత్తి . ఆర్థిక ఆదా ఏర్పడుతుందని తెలిపిన విద్యుత్ శాఖ అధికారులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సూర్య ఘర్ కేంద్ర ప్రభుత్వ పథకమైన సోలార్ విద్యుత్ తో విద్యుత్ ఉత్పత్తి, విద్యుత్ బిల్లుల ఆదా పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పథకం ద్వారా సబ్సిడీతో సోలార్ విద్యుత్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం వాటిని వినియోగించి విద్యుత్ బిల్లుల ఆదా చేసుకోవడం ఎలా అనే విషయంపై వక్తలు వివరించారు.. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయ డి ఈ టి. కె.బాలచంద్ర, ఆత్మకూరు డివిజనల్ డి ఈ. భాను నాయక్, ఏ డి ఈ చిన్న స్వామి నాయక్, విద్యుత్ శాఖ కలిగిరి ప్రాంత డి ఈ కృష్ణమోహన్, పట్టణ ఏఈ జమీల బేగం, ఇతర మండలాల ఏఈలు జేఈలు పట్టణ విద్యుత్ శాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వీరితోపాటు సోలార్ ఉత్పత్తి ప్లాంటేషన్ నిర్వాహకులైన గ్రీన్ ఎనర్జీ సోలార్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పి.మధు వారి సిబ్బంది చైతన్య, రసూల్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సూర్య ఘర్ పథకం ద్వారా సోలార్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల విద్యుత్ సమస్యలు ఏర్పడవని విద్యుత్తును మీరే ఉత్పత్తి చేసుకోవడం, మీరే వాడుకోవడము, మీ విద్యుత్ బిల్లు తగ్గింపు మీ చేతుల్లోనే ఉంటుందని ప్రజలను ఉద్దేశించి వారు తెలిపారు. సోలార్ యూనిట్ ఏర్పాటు వల్ల ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఎంత ఆదా అవుతుందో వివరించారు.సోలార్ ప్లాంటేషన్ ఏర్పాటు కొరకు విద్యుత్ శాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.