పయనించే సూర్యుడు జూలై 6 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలంసుండుపల్లె : సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సుండుపల్లె ఎస్సై ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. కొందరు వ్యక్తులు టిడిపి జిల్లా నాయకులు మరియు మండల నాయకులపై వాట్సప్ గ్రూపులలో అసభ్యకర పోస్టులు పెట్టిన ముగ్గురు వ్యక్తులపై టిడిపి మండల అధ్యక్షుడు కళ్ళే రెడ్డప్ప శనివారం ఎస్సై ముత్యాల శ్రీనివాసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి పార్టీకి చెందిన నాయకులు మరియు కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించడం హేయనీయమైన చర్య అని, ఇలాంటి సంఘటనలను ఉపేక్షించేది లేదని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిపై పోలీసులు స్పందించి శాఖాపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలన్నారు. టిడిపి మండల అధ్యక్షుడు కల్లేరెడ్డప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై ముత్యాల శ్రీనివాస్ తెలిపారు.