
పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 16(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి లోని చవ్వా అశ్వర్థమ్మ వృద్ధాశ్రమంలో వృద్దులకు స్టార్ ప్యారడైజ్ హైస్కూల్ యాజమాన్యం, విద్యార్థులు దుస్తులు పంపిణీ చేశారు. వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్టార్ ప్యారడైజ్ హై స్కూల్ మేనేజ్మెంట్ నాగేంద్ర, ఇలాహి, రంగ మాట్లాడుతూ కన్న బిడ్డల ఆదరణకు నోచుకోని వృద్దులకు తమ వంతు సాయం చేయాలనే ఉద్దేశంతో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి అన్నదానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శశి,నేత్ర,పరమేష్, రాజశేఖర్,జవాన్ ఆది, వృద్ధాశ్రమ నిర్వాహకుడు పామిశెట్టి బాలయ్య తదితరులు పాల్గొన్నారు
