పయనించే సూర్యుడు ఫిబ్రవరి 04హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డితెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.ముందుగా ఎంపీటీసీ , జడ్పీటీసీ లకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించగా నేడు అసెంబ్లీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అటు మంత్రి పొంగులేటి మాటలతో ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.