
పయనించే సూర్యుడు ఆగస్టు 7 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)కొత్తపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సంపతి కనకేశ్వరావు అధ్యక్షతన వారి నివాసంలో మండల భాజపా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర భాజపా కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం, కొత్తపేట మండల ఇంచార్జి అయినవిల్లి సత్తిబాబు పాల్గొన్నారు. ముఖ్య అతిధులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని, బూత్ స్థాయిలో భాజపాను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మండల కమిటీ వివిధ విభాగాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించారు. వెనుకబడిన తరగతుల విభాగం అధ్యక్షులుగా రేలంగి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శులుగా దంగేటి సాయి కుమార్, వెన్నేటి రామకృష్ణలను, రైతు విభాగం అధ్యక్షులుగా చోడపనీడి నాగబాబు, ప్రధాన కార్యదర్శులుగా చోడపనీడి ఈశ్వర్ రావును, యువ విభాగం మండల అధ్యక్షులుగా అడబాల రమేష్, ప్రధాన కార్యదర్శిగా చోడపనీడి ముఖేశ్ ను, మైనారిటీ విభాగం మండల అధ్యక్షులుగా అజ్జరపు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా కె. సత్యానందం, పిల్లి ప్రభాకర్ ను, మహిళా విభాగం మండల అధ్యక్షురాలిగా పేకేటి కామేశ్వరి దివ్యను, మండల ప్రధాన కార్యదర్శిగా కోటిపల్లి సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా బి.వి.వి. సత్యనారాయణాచార్యులును, షెడ్యూల్ కులాల విభాగం మండల అధ్యక్షులుగా తరిట్ల శివరామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా సాకా రామకృష్ణలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ విభాగం నాయకులు పాలూరి జయ ప్రకాష్ నారాయణ, యువ విభాగం జిల్లా ఉపాధ్యక్షులు కోటిపల్లి దామోదర్, రైతు విభాగం నాయకులు ఉద్దరాజు ప్రసాద్ రాజు, మందపల్లి దేవస్థానం సంచాలకులు కోటిపల్లి సుబ్బలక్ష్మి, ఆత్మ కమిటీ సంచాలకులు పాలాటి మాధవ స్వామి, మండల ప్రధాన కార్యదర్శి బల్ల రాజు, జిల్లా షెడ్యూల్ కులాల విభాగం అధ్యక్షులు పొనుగుపాటి శ్రీనివాస్, అన్యం సత్యనారాయణ, జిల్లా యువ విభాగం కార్యదర్శి వలపశెట్టి కిరణ్, జిల్లా రైతు విభాగం కార్యవర్గ సభ్యులు కోటిపల్లి రఘురామ్, సిద్ధంశెట్టి శంకర్ తదితరులు పాల్గొన్నారు