సబ్ టైటిల్:గ్రామాల అభివృద్ధి యువత'తోనే సాధ్యం. అచ్చునూరి కిషన్ ముదిరాజ్.
పయనించే సూర్యుడు: జనవరి10: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి: రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లాకేంద్రం లో శుక్రవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మాట్లాడుతూ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువత సన్నద్ధం కావాలని, రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగకుండా, మహానీయులను, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకొని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత అత్యధికంగా బరిలో నిలిచి, గ్రామాల అభివృద్ధి'యే యువతితో సాధ్యం అవుతుందని ప్రజలను చైతన్య పరుస్తూ, తెలంగాణా తొలి,మలిదశ ఉద్యమం అనేది విద్యార్థి, నిరుద్యోగ యువత తోనే ఉప్పెనలా ఎగిసిపడి యావత్ తెలంగాణ సమాజాన్నే చైతన్యం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో యువత పాత్ర అమోఘం, అద్భుతం అని గుర్తెరిగి తెలంగాణ ఉద్యమాన్ని, మహనీయులను స్పూర్తిగా తీసుకుని సమాజం లో అందరికి ఆదర్శంగా ఉంటూ, ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా, రాజకీయ పార్టీల నాయకుల మాటలకు, వారి ప్రలోభాలకు లొంగకుండా, గ్రామాల అభివృద్ధి యువత' తోనే సాధ్యం అవుతుందని ప్రతి ఒక్క యువతి -- యువకులు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి యువ శక్తి సత్తా ఏంటో నిరూపించాలని యువతీ యువకులకు పిలుపునివ్వడం జరుగుతుంది అని శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అంతే కాకుండా గ్రామాల అభివృద్ది కోసం యువత ముందుకు రావాలని తెలియ జేశారు.