స్థానిక సమరానికి సై…
▪ పథకాలతో ఫైటింగ్ కు సిద్ధమవుతున్న అధికార పార్టీ.
▪ నేతలు కార్యకర్తలను సిద్ధం చేస్తున్న పీసీసీ.
▪ ఇప్పటికే జిల్లాల పర్యటనలో పూర్తి, కార్యచరణ సిద్ధం.
▪రైతు భరోసా, కూలీలకు ఆర్థిక సాయం పై భారీ ప్రచారం.
పయనించే సూర్యుడు జనవరి 15హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి... స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోoది . ఈ ఎన్నికలలో అధిక శాతం స్థానాలను కైవసం చేసుకుని ప్రతిపక్ష పార్టీలపై పై చేయి సాధించాలని చూస్తుంది. స్థానిక ఎన్నికల కు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఎన్నికల యంత్రాంగం సైతం ఏర్పాట్లు చేస్తుంది ఇందులో భాగంగానే గత వారంలో ఓటర్ల వివరాలను తెలుపుతూ ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రకటించింది. సంక్రాంతి పండగ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందని భావిస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేడర్ ను రంగంలోకి దించుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గెలుపు వ్యూహాలపై దృష్టి సారించారు. రెండు రోజుల క్రితం సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోని వెళ్లాలని సూచించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇంట్లో లబ్ధిరాలను వెంటనే ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ పథకాల వల్ల లబ్ది పొందే వాళ్లంతా స్థానిక సంస్థలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను మద్దతు ఇచ్చేలా చూడాలని మంత్రులకు సూచించారు.ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల జాబితాను ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులకు అందజేయాలని సీఎం కలెక్టర్లను ఆదేశించడంతో మతలబు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలవడం కోసమే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.