పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ : భావుసింగ్ నాయక్ : ఏన్కూర్ఈ రోజు స్థానిక సమస్యలను పరిష్కరించాలంటూ ఏన్కూర్ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది . ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం మాట్లాడారు మండలంలోని వివిధ గ్రామాలలో సిపిఎం బృందం గత పది రోజులుగా సర్వే నిర్వహించి అనేక సమస్యలను వెలికి తీయడం జరిగింది అనేక గ్రామాలలో మండల కేంద్రంలో కోతుల బెడద విపరీతంగా ఉందని ప్రభుత్వం తక్షణమే వాటిని నివారించాలని ఆయన అన్నారు వివిధ గ్రామాలలో మంచినీటి సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. గ్రామపంచాయతీలలో పాలకమండలి లేక డ్రైనేజీ వ్యవస్థ పేరుకుపోయి ఉందని సీసీ రోడ్ల నిర్మాణం లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు గత ప్రభుత్వాలు 10 సంవత్సరాలుగా వితంతువులకు వికలాంగులకు పెన్షన్లు ఇవ్వలేదని ఈ ప్రభుత్వం కూడా సంవత్సరం నరకడుస్తున్న ఎంతవరకు కొత్త పెన్షన్ ఇవ్వలేదని వెంటనే ప్రభుత్వం స్పందించి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ఆయన అన్నారు అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీల పేరుతో నిజమైన లబ్ధిదారులను కాదని అనర్హులకు ఇందిర మైండ్లు మంజూరు చేస్తున్నారని ఇది సరైనది కాదని గత ప్రభుత్వం కూడా దళిత బంధు పేరుతో అనేక మోసాలు చేసిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే రీతిలో వ్యవహరిస్తుందని తన పద్ధతిని మార్చుకోకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని ఆయన అన్నారు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఆయన అన్నారు గత ఐదు సంవత్సరాలుగా నిరుపేదలైనటువంటి 30 కుటుంబాల వారు లెనిన్ నగర్ పేరుతో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారని వారికి ఎటువంటి మంచినీటి సౌకర్యం లేదని విద్యుత్ సౌకర్యం లేదని చీకటిలోనే మగ్గుతున్నారని వారికి వెంటనే విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దంతాబోయిన నాగేశ్వరరావు బానోత్ బాలాజీ ఏర్పుల రాములు ఇటకాల లెనిన్ స్వర్ణ కృష్ణారావు కాలసాని సాయి కోటేశ్వరరావు గుడ్ల వెంకటేశ్వర్లు బండ్ల చిన్న జోగయ్య శ్రీనివాసరావు పొరల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు