- ముఠాగా ఏర్పడి యువతికి బెదిరింపులు
- విడతల వారీగా డబ్బులు డ్రా చేయించిన సైబర్ క్రిమినల్స్
- ఆటకట్టించిన సిటీ పోలీసులు, ముగ్గురికి బేడీలు
హైదరాబాద్ సిటీ: ఓ యువతికి స్నాప్ చాట్ ద్వారా పరిచయమైన యువకుడు స్నేహితులతో ముఠాగా ఏర్పడి పథకం ప్రకారం రూ. 48.38లక్షలు కొల్లగొట్టాడు. రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ హైదరాబాద్(Hyderabad)కు చెందిన ముగ్గురు సైబర్ నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టారు. సీపీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతికి స్నాప్‌చాట్‌లో అమన్ జోషి పరిచయమయ్యాడు. ముందుగా ఆమెతో స్నేహం నటించి పరిచయం పెంచుకున్నాడు.
ఆ తర్వాత తన అవసరాలకోసం ఆమెనుంచి రూ. 15వేలు అప్పు తీసుకున్నాడు. ఆమెను బెదిరించి, భయపెట్టి, లక్షల్లో డబ్బులు లాగాలని పథకం వేశాడు. మరో ఇద్దరు స్నేహితులు ప్రశాంత్, రోహిత్ శర్మతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. రోహిత్‌శర్మ ఆమెను ఆన్లైన్లో సంప్రదించి పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. మీవద్ద అక్రమ బంగారం ఉందని, అమన్ జోషితో పాటు మీకూ అక్రమ బంగారంతో లింక్ ఉందని బెదిరించాడు. క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపుతానని బెదిరించాడు.