పయనించే సూర్యుడు న్యూస్ :ఫిబ్రవరి 1అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి)
అనంతసాగరం మండలంలోని సోమశిల లో ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కుష్టు వ్యాధి మరియు హెచ్ఐవి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా పారామెడికల్ అధికారి ఎం మోహన్ రావు ఆధ్వర్యంలో చేపట్టారు తొలుత ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు కుష్టు వ్యాధి ఎలా వస్తుంది?ఎవరికి వస్తుంది? వ్యాధి వస్తే నివారణ ఉందా లేదా అన్నదానిపై వివిధ రకాల స్లైడ్ లను ఉపయోగించి చూపుతూ అవగాహన వచ్చేలా వారికి విసిదీకరించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ టీవీ ద్వారా లెప్రసి పై స్లైడ్ లను చూపుతూ వారికున్న అపోహలను తొలగించారు ఇప్పుడు కుష్టు వ్యాధి అనేది పెద్ద రోగం కాదని ఇప్పుడు ఉన్నటువంటి అనేక రకాల జబ్బుల్లో ఇది చాలా సున్నితమైనదని చిన్నదిగా అభివర్ణించారు ఎవరి శరీరం పై నైనా స్పర్శ లేని మచ్చలు ఏర్పడిన వెంటనే వైద్యుల్ని సంప్రదించి పిబి చికిత్స తీసుకుంటే ఆరు నెలల లోపే జబ్బు నయమవుతుందని ఇంకొంచెం ముదిరిన ఎంబీ చికిత్స ద్వారా 12 నెలల పాటు ఎండీటి మందులు తీసుకున్న ప్రజలకు ఉన్న అపోహలు తొలగించుకుని ప్రతి ఒక్కరూ వైద్య సేవలు పొందాలని సూచించారు విధ్యార్దినీ విధ్యార్దులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థినీ విద్యార్థులతోస్పర్శ లెప్రసీ ప్రతిజ్ఞను చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా పారామెడికల్ అధికారి ఎం మోహన్ రావు, అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లెప్రసీ నోడల్ పర్సన్ టి వి ఆర్ వి ప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ అబ్దుల్ ఖాదర్ ఎమ్మెల్యే హెచ్ పి అనూష ఏపీ టీ డబ్ల్యూ ఆర్ ఎస్ ప్రిన్సిపల్, జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు