తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన* పయనించే సూర్యుడు న్యూస్ 14 సెప్టెంబర్
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ స్మశాన వాటిక ప్రాంగణంలో దుండగులు అక్రమంగా చెట్లు నరికివేత ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని స్మశాన వాటికలో జరిగింది.అక్రమంగా నరికిన చెట్లను తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఐదు నుండి ఆరు సంవత్సరాల చెట్లను నరికి,కలపను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు.ఇన్స్పెక్టర్ వనిత మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెట్లను నరికి వేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగిన తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.