పయనించే సూర్యుడు న్యూస్ జూలై 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాలలో భాగంగా మేరా యువభారత్ ఆధ్వర్యంలో జూలై పది వ తారీకు గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిముషాలకు రక్తదాన శిబిరంను ఆల్విన్ కాలనీ డివిజన్, భూదేవిహిల్స్ కాలనీ, ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్ రావు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువమోర్చా ప్రబారి కాసం వెంకటేశ్వర్లు యాదవ్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్ విచ్చేస్తున్నారు అన్నారు. కావున రక్తదానం ప్రాణదానం అనే మహోత్తర కార్యక్రమంలో పాల్గొని ప్రాణదాతలు కావాలని యువతను కోరుతున్నాను అన్నారు. అలాగే బిజెపి నాయకులు కార్యకర్తలు నరేంద్ర మోడీ అభిమానులు, రామచందర్ రావు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు.