పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 2 :- రిపోర్టర్ (కే శివకృష్ణ) బాపట్ల మండలం సూర్యలంక లో పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెం కె.వి.ఆర్, కె.వి.ఆర్ & ఎం.కె.ఆర్ కాలేజీ N.S.S. మరియు N.C.C.విద్యార్థులతో కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ సూర్యలంక బీచ్ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పాల్గొన్నారు. ముందుగా విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సముద్ర తీరంలో ఉన్న వ్యర్ధాలను విద్యార్థులతో కలిసి శుభ్రం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆశయ సాధన కోసం స్వచ్ఛ బాపట్ల కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు,కాలేజీ సిబ్బంది మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలకు తదితరులు పాల్గొన్నారు.