పయనించే సూర్యుడు అక్టోబర్ 8,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల స్థానిక భీమవరం రస్తాలో ఉన్న స్వర్గధామం నందు 1000 పూల మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొని మొక్కలు నాటారు,అలాగే పోయిన సంవత్సరం దసరాకి మంత్రి ఫరూక్ చేతుల మీదుగా నాటిన నాలుగువేల పూల మొక్కలు ఈరోజు ఒక అందమైన బృందావనంగా తీర్చిదిద్దబడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దుర్భరమైన పరిస్థితుల్లో పబ్లిక్ టాయిలెట్స్ గా వాడుకునే స్మశానవాటికలను నవనిర్మాణ సమితి ఒక ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన స్మశాన వాటికలుగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు . ఈ స్వర్గధామం రాయలసీమలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వనపర్తి జడ్చర్ల పట్టణాల నుంచి కూడా వచ్చి స్వర్గధామాన్ని ఏ విధంగా నిర్వహించేది తెలుసుకొని పోవడం నంద్యాల స్వర్గధామం యొక్క కృషిని అభినందించదగ్గ విషయం అన్నారు . అంతేకాకుండా ఇందులో పనిచేస్తున్న స్వర్గధామం సేవకులు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అన్ని సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు.స్వర్గ ధామం అధ్యక్షులుగా డాక్టర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ ఇంకా కొన్ని వసతులు ఈ స్వర్గధామం లో చేయవలసిన అవసరం ఉంది దానికోసం ఆర్థిక వనరుల అవసరం ఉందని చెప్పడం జరిగింది.ఇంకొక వెకుంఠ ఒక వైకుంఠ రథం ఇంకా కావలసిన అవసరముంది. అలాగే నంద్యాల చుట్టుపక్కన గ్రామాలకు కూడా స్వర్గధామం సేవలను ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పడం జరిగింది . అనంతరం మంత్రి ఫరూక్ గారి చేతుల మీదుగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అవార్డును అందుకున్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు , నెరవాటి సత్యనారాయణ , ఒకటో వార్డు కౌన్సిలర్ నాగార్జున , పబ్బతి వేణు , గెలివి రామకృష్ణ, సి. రాజశేఖర్, కొమ్మ హరి, సముద్రాల పాండురంగయ్య, బొగ్గరపు సత్యనారాయణ, బాబురావు, చిత్తలూరు రాంప్రసాద్, నెరవాటి మధు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.