
{ పయనించే సూర్యుడు } {ఏప్రిల్ 3మక్తల్}
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మక్తల్ ఉపమండల హిందూ సమ్మేళనం రామ్ లీలా మైదానం మక్తల్ లో నిర్వహించడం జరుగుతుంది అని కార్యక్రమ సమితి అధ్యక్షులు శ్రీ డా. శ్రీరామ్ తెలుపడం జరిగినది. ఈ కార్యక్రమం లో ముఖ్య అధితి గా మద్దిమడుగు పిఠాదిపతి శ్రీశ్రీ కెతావత్ జయరాం గురుస్వామి వీరు మన తెలంగాణ లో హనుమాన్ మాలధారణ ప్రారంబికులు ముఖ్య వక్త గా తెలంగాణ ప్రాంత గో సేవా ప్రముఖ్ శ్రీ వెంకట నివాస్ పాల్గొంటారని తెలుపడం జరిగింది.కావున ఈ హిందూ సమ్మేళనం కు హిందువులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా విచ్చేసి విజయవంతం చేయగలరని కోరడం జరిగినది.
