
“రాజ్యాంగ హక్కుల సాధన సభ విజయవంతం చేద్దాం”
( పయనించే సూర్యుడు నవంబర్ 1 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ వద్ద మాల మహానాడు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది.జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి ఆదేశానుసారం హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమం నవంబర్ 26 వ తారీకు నా తెలంగాణ ప్రాంతం నుండి మన దుబ్బాక నియోజకవర్గం నుండి అత్యధికంగా తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది రాజ్యాంగ పరిరక్షణ కోసం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాల మహానాడు పొలిటి బ్యూరో చైర్మన్ ర్యాకం శ్రీరాములు మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ కాల్వ నరేష్ సిద్దిపేట జిల్లా మాల మహానాడు నాయకుడు మండల యాదగిరి దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్ ఉపాధ్యక్షులు బైండ్ల నరేష్ ప్రధానకార్యదర్శి గొల్లపల్లి ప్రేమ్ నాయకులు చామంతి శేఖర్ . చామంతిరాజు. బొల్లంస్వామి. బొల్లంనర్సింలు.మరియు అంబేద్కర్ సభ్యులు పాల్గొన్నారు.