
పయనించే సూర్యుడు ఆగస్టు 11 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డా: బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం హసన్బాద గ్రామంలోని మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో ఆషాఢ మాస శివరాత్రి పర్వదినాన ఉండి వీరభద్రశర్మ బ్రహ్మత్వంలో మాణిక్యాంబ అమ్మవారిని శాకాంబరీగా అలంకరించి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మహిళలు గ్రామ ప్రదక్షిణగా మేళతాళాలతో వివిధ రకాల స్వీట్లు, పళ్లు, పసుపు కుంకుమ, పువ్వులతో సారె సమర్పించారు. అమ్మవారికి విశేష కుంకుమార్చన, నీరాజనం, మంత్ర పుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. సంగీత గాయకులు జయంతి సరోజ అమ్మవారి లలిత గీతాలాపన చేయగా గ్రామ మహిళలు లలిత సహస్రనామాలు పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి, మాజీ సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు, చోడిశెట్టి వీరభద్రరావు, బొల్లం సత్తిరాజు, ఎరుబండి చినసత్యనారాయణ, గొల్లపల్లి బ్రదర్స్, చింతపల్లి రాంబాబు, ఇంటి వీరబాబు, దునే అర్జున, చాగంటి నరసింహమూర్తి, సతీష్, కాకిలేటి సత్యనారాయణ, కోరుకొండ వీరబాబు, సింగిరెడ్డి రామయ్య, కాల్దారి బ్రహ్మం, భలే బాబూరావు, కాసపు వీరబాబు, కాకిలేటి రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.