పయనించే సూర్యుడు జనవరి 21 హసన్ పర్తి మండలం ప్రతినిధి పోగుల రాజ్ కుమార్... హసన్ పర్తి 66వ డివిజన్ లో ఈరోజు ప్రజాపాలన గ్రామసభ లోముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 66వ డివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ హాజరై గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,రైతు భరోసా, కొత్త రేషన్ కార్డ్,ఇందిరమ్మ ఇండ్లు వీటికోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని వారు ఈ సమావేశంలో తెలిపారు.ఈ కార్యక్రమంలో హసన్ పర్తి సిఐ వి.చేరాలు, ఏ ఈ ఓ కల్పన, సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, మున్సిపల్ ఆర్ ఐ సునీల్, వార్డ్ ఆఫీసర్ రాజు, 66వ డివిజన్ అధ్యక్షులు కనపర్తి కిరణ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు విజయమూరు వెంకటేశ్వర్లు, జన్ను రవీందర్, తాళ్ల మధు, పల్లెకు అనూష, బస్కూరి వాణి, మాజీ సర్పంచ్ పుల్ల రవీందర్, మాజీ చైర్మన్ ఆరెల్లి వెంకటస్వామి, శీలం రమేష్, కనపర్తి రాజు, గొర్రె కిరణ్, వేల్పుల సంపత్, పెద్దమ్మ నరసింహారావు, బిగుళ్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు