సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత ఆవునూరి మధు పిలుపు
పయనించేసూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పొనకంటి ఉపేందర్ రావు : టేకులపల్లి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 20వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్లను శనివారం టేకులపల్లి మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు.ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అమలు కానీ అనేక హామీలను ప్రజలకు ఇచ్చి అందులో 6 గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తామని ఆరు గ్యారెంటీ ల పేరుతో ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందు ఉంచి ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన తర్వాత ఆరు హామీలను అటకెక్కించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలకై ఈనెల 20వ తారీఖున హైదరాబాదులో జరుగు ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యం ఏడవ గ్యారెంటీగా ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడవ గ్యారెంటీని ఏటిలో కలిపారని ఏ ఒక్క హామీపై స్పష్టత లేదని అధికారమే పరమావధిగా హామీలను గుప్పించి నేడు కాలయాపన చేస్తూ గడువులు పెడుతూ ప్రభుత్వం అసమర్ధతను చాటుకుంటుందని అన్నారు.
హామీల అమలకై ప్రజలు .కార్మిక వర్గం హైదరాబాదులో కదం తోక్కాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో, సిపిఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు భూక్య హర్జా, భూక్య నర్సింగ్, గుగులోత్ రామచందర్, ఎట్టి నరసింహారావు, కోడెం రవి, బోడ మంచా, మంగీలాల్, బాలు, పి వై ఎల్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నోముల భానుచందర్, మండల కార్యదర్శి. తోటకూరి సతీష్, తదితరులు పాల్గొన్నారు.