
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
ఈ శోభయాత్ర లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని హిందూ వాహిని ఉత్సవ కమిటీ తరపున కోరడం జరిగింది.
శ్రీరామనవమి సందర్భంగా రేపు శుక్రవారం రోజున మహిష పట్టణంలో హిందు వాహిని ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర ఘనంగా నిర్వహించబడుతుంది కావున రామ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం శ్రీ రాముని శోభాయాత్ర నిర్వహిస్తున్న హిందూ వాహిని కమిటీ వారు ఈ యొక్క శోభాయాత్రను ఈ సంవత్సరం కూడా గత 15 సంవత్సరాలు శాంతియుతంగా జరిగిన విధంగా ఈ సంవత్సరం కూడా అదే విధంగా శాంతియుతంగా ప్రశాంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని హిందూ వాహిని కార్యకర్తలు అందరిని కోరుకుంటున్నాము అలాగే మహిషా పట్టణ సమాజ సేవకులు హిందూ బంధువులు అందరూ గత సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న మీ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా మజ్జిగ కానీ నీరు గాని అల్పాహారం గాని భోజనం గానీ అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎండలు బాగా ఉన్నందున ఈ సంవత్సరం కూడా అలానే మీ వంతు సహకారాలు అందించాలని నిర్వహించాలని కోరుకుంటున్నాము అలానే ఈ శుభ యాత్రకు వచ్చే భక్తులందరూ మన హిందు వాహిని కమిటీకి కార్యవర్గానికి వారు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఈ శోభాయాత్రను నిర్వహిస్తున్న హిందూ వాహిని కమిటీ వారందరికీ రామ భక్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను .
హిందూ ఉత్సవ కమిటీ మహిష